పెళ్ళి చేసుకుంటానని నాలుగు నెలలు సహజీవనం, కట్నం అధికంగా వస్తోందనీ?
పెద్దలను తీసుకుని పెళ్ళి చూపులకు వచ్చాడు. అమ్మాయి నచ్చిందంటూ పెళ్ళికి ఒకే అన్నాడు. అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్ళాడు. నాలుగు నెలలు సహజీవనం చేశాడు. ఆ తరువాత యువతిని ఇంటికి పంపించేశాడు. మంచి ముహూర్తం చూసుకుని పెళ్ళి చేసుకుందామని చెప్పాడు. అయితే ఆ తరువాత కట్నం ఎక్కువ వస్తుందని ఆశపడ్డాడు. ఇంకేముంది ఆ యువతికి హ్యాండిచ్చాడు. లబోదిబోమంటూ ఆ యువతి రోడ్డెక్కింది.
పీలేరు మండలం రేగళ్ళు పంచాయతీ నగరి గ్రామంలో రేగళ్ళు గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న ఓ యువతిని నాలుగు నెలల క్రితం పెళ్ళి చూపులు చూశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఆమెను పెళ్ళిచేసుకుంటానని బెంగుళూరుకు తీసుకెళ్ళాడు.
కొన్నిరోజుల పాటు అక్కడే సహజీవనం చేశాడు. యువతి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబం కావడంతో ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ప్రస్తుతం తనతో పాటు బెంగుళూరులో పనిచేసే మరొక యువతిని పెళ్ళాడేందుకు సిద్థమయ్యాడు మణికంఠ. ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడ్డాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న యువతి పీలేరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రోడ్డుపై బైఠాయించి న్యాయం కావాలంటూ రాస్తారోకో నిర్వహించింది.