ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (13:25 IST)

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను వేధిస్తున్నారు: ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు లేఖ రాశారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన లేఖలో వాపోయారు. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ ఘటన మరవకముందే.. ప్రైవేట్‌ ఆస్పత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించారన్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఘటనపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.  ఆ లేఖ వివరాలు యధావిధిగా...
 
ఫ్రంట్‌లైన్ వారియర్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సంవత్సరం కు పైగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. 
కానీ, ఫ్రంట్ లైన్ యోధులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా ఇబ్బందులు, పరిస్థితుల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీత కన్నుతో వ్యవహరిస్తుంది.
2020 మే నెలలో విశాఖపట్నంలో దివంగత దళిత డాక్టర్ సుధాకర్ అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోక ముందు, విశాఖపట్నంలో మరో ఫ్రంట్ లైన్ యోధురాలుపై వేధింపులు వెలుగులోకి వచ్చాయి. 
విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న దళితురాలైన శ్రీమతి లక్ష్మి అపర్ణ  లాక్డౌన్ సడలింపు పని గంటల తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు. 
అయితే, పోలీసులు ఆమెను రామా టాకీస్ సమీపంలో అడ్డగించి, అనవసరమైన వేధింపులకు గురిచేశారు.
వైసీపీ ప్రభుత్వంలో ఒక వర్గం  పోలీసులు ప్రజాస్వామ్య ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు.
పర్యవసానంగా ఫ్రంట్‌లైన్ యోధులు, ప్రతిపక్ష నాయకులు, సామాన్య ప్రజానీకం, మరీ ముఖ్యంగా దళితులు వేధింపులకు గురవుతున్నారు, 
అయితే, ఇంతవరకు అలాంటి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు లాంటి సంఘటనలు వలసరాజ్యాల పాలనను గుర్తుకు తెస్తున్నాయి.
కరోనా మహమ్మారి ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు, తీవ్రమైన ఒత్తిడికి గురిచేసింది. 
ఇలాంటి పరీక్షా సమయాల్లో పోలీసులు అర్ధంలేని వేధింపులు కట్టిపెట్టి స్నేహపూర్వక పోలీసింగ్ చాలా అవసరం. 
రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్‌ను నిర్ధారించడానికి తప్పు చేసిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.