గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (14:56 IST)

విశాఖలో గంజాయి చాక్లెట్లు.. స్కూల్, కాలేజీ స్టూడెంట్లే టార్గెట్

Ganja-laced chocolates
Ganja-laced chocolates
గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఈ విక్రయాలు చివరికి విశాఖలోని విద్యార్థుల్ని టార్గెట్ చేశాయి. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్నా విక్రేతలు కొత్త ఫంథాలను ఎంచుకుంటున్నారు. 
 
ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి చాక్లెట్లను ఇచ్చి యువతను వ్యసనపరులుగా మారుస్తున్నారు. విశాఖ నగరంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు వెలుగు చూడటం షాకిచ్చింది.
 
విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులో తనిఖీ చేసి, 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.