గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (21:21 IST)

చంద్రబాబుకు వరద రిలీఫ్ కింద చెక్ ను అందించిన బాలక్రిష్ణ

Balakrishna gave a check  to Chandrababu
Balakrishna gave a check to Chandrababu
 
 
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద తాకిడికి ప్రజలు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పంట, ఆస్తినష్టం భారీగా జరిగింది. ఇందుకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులతో ప్రజలకు సహాయ చర్యలు నిర్వహించారు. మరోవైపు ప్రముఖులు తమకు తోచినవిధంగా ఇటు సినిమా రంగం, అటు రాజకీయ రంగం, వ్యాపార రంగం నుంచి సి.ఎం. రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. 
 
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా భారీ సాయాన్ని అందించారు. కాగా, నేడు ఎం.ఎల్.ఎ. నందమూరి బాలక్రిష్ణ కూడా చెక్ ను అందించారు. తన నిబద్ధతకు కట్టుబడి సహాయ నిధికి చెక్కును చంద్రబాబుకు అందజేసారు. ఎంత మొత్తం అనేది తెలియపర్చలేదు.