గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (17:55 IST)

పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం.. ఆలస్యం చేయొద్దన్న సీఎం

ys jagan
విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం అయ్యింది. సీఎం జగన్ ఈ సదస్సు ముగింపు ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిందని.. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు జగన్ వివరించారు.
 
సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనలో ఆలస్యం చేయకూడదని, ఏపీ సర్కారు నుంచి పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 
 
తాము చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నామని జగన్ వెల్లడించారు. పర్యావరణ హిత ఇంధన, శక్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జగన్ తెలిపారు.