గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 మార్చి 2023 (13:18 IST)

రాజమహేంద్రవరంలో ''లేడీ సింగం'': నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారులు బెంబేలు

plastic
సింగం చిత్రంలో సూర్య ఎవర్నీ లెక్కచేయకుండా స్మగ్లర్ల ఆటకట్టిస్తాడు. రాజకీయ వత్తిళ్లనే పైఅధికారులను కూడా లెక్కచేయడు. ఇపుడు ఇలాంటి అధికారిణి రాజమహేంద్రవరంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్ముతున్న వారికి చుక్కలు చూపించారు.
 
వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పర్యావరణ ఇంజినీరు సైదా. ఈమె పారిశుద్ధ్య మార్కెట్టుకు వచ్చి అక్కడ నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు, సంచిలు, ప్లేట్లు అమ్ముతున్న షాపులపై దాడులు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేసారు. దీనితో పైస్థాయి వారి నుంచి ఆమెకి ఫోన్సు వచ్చినట్లు సమాచారం. ఐనప్పటికీ వారి మాటలను లెక్కచేయకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఆమె ధైర్యంగా చర్యలు తీసుకుని ముందుకు సాగారు. దీనితో ఆమెకి ప్రజల నుంచి పెద్దఎత్తున ప్రశంసలు అందుతున్నాయి.