మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (10:08 IST)

మండలి రద్దు చేస్తారట.. చేసుకోండి.. ఏం చేసినా అప్పటివరకు మండలి ఉంటుది : గోరంట్ల

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయనుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్టుగా ఆడించేందుకు శాసనమండలి ఏం గంగ్గిరెద్దు కాదన్నారు. పైగా, మండలిని రద్దు చేయాలని ఒక వేళ తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనమండళ్లను రద్దు చేయమని, పునరుద్ధరించమని కోరుతూ ఆరేడు కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. నాడు టీడీపీ హయాంలో శాసనమండలిని రద్దు చేయడానికి ఐదేళ్లు పడితే ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించడానికి ఇరవై రెండేళ్లు పట్టిందని గోరంట్ల గుర్తుచేశారు. 
 
మండలిని రద్దు చేయాలంటే దానికి ఓ విధానమంటూ ఉందని అదంతా పూర్తయ్యే వరకూ మండలి కొనసాగుతుందని, ఛైర్మన్, సభ్యులు అలాగే ఉంటారని, వాళ్ల హక్కులను ఎవరూ హరించలేరని చెప్పుకొచ్చరు. కేంద్రం సమ్మతించి, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి.. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేస్తే వరకు శాసనమండలి ఉంటుందని, జగన్ అనుకున్న వెంటనే మండలిని రద్దు చేయడం అంత ఈజీ కాదన్నారు.