శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (13:59 IST)

బాత్రూమ్ వద్ద కాపలా కాసిన విజయసాయి రెడ్డి : బచ్చుల అర్జునుడు

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై రెండు రోజుల పాటు శాసనమండలిలో చర్చ జరిగింది. ముఖ్యంగా, బుధవారం సభలో అత్యంత నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆ సమయంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా మండలి గ్యాలెరీలో ఉన్నారు. అక్కడు ఆయన వ్యవహరించిన తీరును తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పూసగుచ్చినట్టు మీడియా ముందు వివరించారు. 
 
ముఖ్యంగా విజయసాయిరెడ్డి తీరు, ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఖండిచారు. మండలి ఛైర్మన్ షరీఫ్ బాత్రూంకు వెళ్తే... విజయసాయిరెడ్డి బాత్రూమ్ డోర్ వద్దే నిల్చునే పరిస్థితికి దిగజారిపోయారని విమర్శించారు. ఇదేసమయంలో మంత్రి బొత్సపై ఆయన నిప్పులు చెరిగారు. 
 
మతం పేరుతో రేయ్ తురకోడా, నీ అంతు చూస్తానంటూ షరీఫ్‌ను దూషించారని ఆరోపించారు. షరీఫ్ సీటుకు ఇరువైపులా ముగ్గురు మంత్రులు నిల్చుని... ఆయనను కదలకుండా చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకుని మండలి ఛైర్మన్‌గా షరీఫ్ ప్రజాస్వామ్యాన్ని రక్షించారని కితాబిచ్చారు. 
 
సినియా థియేటర్ల వద్ద బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్లు, అవినీతిపరులు, దగాకోర్లు, ఖూనీకోర్లు మంత్రులుగా వస్తే ఏం జరుగుతుందో గతంలోనే తాము చెప్పామని, ఇపుడు వైకాపా మంత్రులు తీరు అందుకు ఏమాత్రం తీసిపోవడం లేదని ఆరోపించారు. వైకాపా మంత్రులు మాట్లాడే భాష కూడా తమకు వచ్చన్నారు. కానీ, తాము అలా మాట్లాడబోమన్నారు. తమకు సంస్కారం ఉందని బచ్చుల అర్జునుడు అన్నారు.