మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 16 జులై 2018 (20:32 IST)

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామ దర్శిని... మంత్రి కాలవ

అనంతపురం : ప్రజా సమస్యలు, అవసరాలు తీర్చడానికే గ్రామ, వార్డు దర్శిని కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణాల్లో ఉన్న ఇళ్లు లేని పేదలందరికీ గృహ యోగం కల్పిస్తున్నామన్నారు.

అనంతపురం : ప్రజా సమస్యలు, అవసరాలు తీర్చడానికే గ్రామ, వార్డు దర్శిని కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణాల్లో ఉన్న ఇళ్లు లేని పేదలందరికీ గృహ యోగం కల్పిస్తున్నామన్నారు. రాయ‌దుర్గం పట్టణంలోని 13 వ వార్డులో వార్డు దర్శిని కార్య‌క్ర‌మాన్నిమంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేద‌ల సంక్ష‌మ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందన్నారు. పేద‌రికం లేని స‌మాజమే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆశ‌యమన్నారు. దీనిలో భాగంగా గ్రామ దర్శిని, వార్డు దర్శిని కార్యక్రమాలతో ప్రజా అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికి ప్రజల చెంతకు ప్రభుత్వం వచ్చిందన్నారు. 
 
పట్టణాల్లో ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాన్ని, ఇళ్ల నిర్మాణాలకు నిధులు అందజేస్తున్నామన్నారు. పెన్షన్ల మొత్తాన్ని ఐదు రెట్లు పెంచామని, మ‌హిళా స్వ‌యంశ‌క్తి సంఘాల‌కు పెట్టుబ‌డి ప్రోత్సాహకాన్ని అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారన్నారు. పేద‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడును ప్ర‌జ‌లు ఆశీర్వదించి అండ‌గా నిల‌వాలని మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో రూ.3000 కోట్ల‌ విలువైన అభివృద్ధి పనులను రాయ‌దుర్గంలో చేప‌ట్టామన్నారు.
 
అనంతరం రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్ర కాలవ శ్రీనివాసులు 13 వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు. వ్యక్తిగత, సామూహిక సమస్యలను పరిష్కారిస్తామని ఆ వార్డు ప్రజలకు మంత్రి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వార్డులోని పెన్షర్లతో కలిసి సామూహిక అల్పాహార విందులో మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు, మునిసిపల్ ఛైర్ పర్సన్ జ్యోతి, 13 వ వార్డ్ కౌన్సిలర్, ప్రజలు,  టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
అనంతరం రాయదుర్గం నియోజకవర్గం డి. హిరేహాల్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. డి. హిరేహాల్ మండల కేంద్రంలో రూ.30 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్, రూ.7 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రాలకు ఆయన భూమి పూజ చేశారు. అదే ప్రాంతంలో రూ.24.60 లక్షలతో నిర్మించిన వ్యవసాయ గోదామును రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు.