మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గుజరాత్‌లో స్థానిక పోరుకు నోటిఫికేషన్.. ఏపీలో వద్దని కోర్టుకెక్కిన సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా లేదు. దీంతో ఎన్నికలను నిలిపివేయాలంటూ న్యాయపోరాటానికి దిగింది. ఇందులో ఇప్పటికే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21, 28 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలను కోరుతూ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో రేపు ఏం జరగబోతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.