1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2015 (19:20 IST)

భూసమీకరణపై ఏపీ సర్కారుకు ఝలక్: రైతులకు ఇష్టం లేకుంటే..

రాష్ట్ర రాజధాని కోసం తలపెట్టిన భూసమీకరణపై ఏపీ సర్కారు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఏపీ రాజధాని భూ సమీకరణపై రైతులకు ఊరటనిచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసుకోనివ్వడంలేదని నోటీసులు ఇచ్చిన రైతుల భూముల్లో పంటలకు ఆటంకం కలిగించవద్దని కోర్టు ఆదేశించింది. భూసేకరణకు సంబంధించి కొంత మంది రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 
 
దానిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ల్యాండ్‌ పూలింగ్‌కు ఇష్టపడని రైతుల భూములను భూ సేకరణ చట్టం ద్వారా సమీకరిస్తామని, పంటలకు ఆటంకం కలిగించకుండా, చట్ట ప్రకారమే ఆ ప్రక్రియ జరుగుతుందని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు.
 
దీనిపై ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.