శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 మే 2024 (19:17 IST)

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

Vasishta Simha
Vasishta Simha
రీసెంట్ గా మహిళలను ఉద్దేశించి ‘ఆడపిల్లనే అయితే ఎంటటా’ అనే హుక్ లైన్ తో చాందినీ చౌదరి క్యారక్టర్ పోస్టర్ ను, అలాగే హాట్ లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ ఆషు రెడ్డి పోస్టర్ ను అలానే అలాగే పోలీస్ ఆఫీసర్ గా ఆక్టర్ భరత్ తో “ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సేస్’  అని పోస్టర్ రిలీజ్ చేశారు, ఆ పోస్టర్స్ అన్నింటికీ విశేష స్పందన లభించింది,

ఇప్పుడు అదే తరహాలో మరో వైదిధ్యమైన కారక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేసారు, కన్నడ రాయల్ స్టార్ వసిష్ఠ ఎన్ సింహ ను ‘యుగంధర్’ లుక్ లో పంచ కట్టులో చేతిలో డమరుకం పట్టుకుని “ఏం? నేను సరిపోనా? అనే హుక్ లైన్ తో మరో పోస్టర్ లాంచ్ చేశారు. యుగంధర్ తెలుగులో ఇప్పటి వరుకు చేసిన అన్ని క్యారెక్టర్ లతో పోలిస్తే ఈ లుక్ చాలా యునీక్ గా ఉంది అని ప్రేక్షకుల నుండి కామెంట్స్ వస్తున్నాయి
 
పిడిపి, సి స్పేస్ ఉమ్మడి బ్యానర్లులో నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ఈ ‘యేవమ్’  జరుగుతుంది, ప్రకష్ దంతులూరి యేవమ్ కి దర్శకత్వం వహించారు. ఒక పక్క హీరోగా చేస్తూ కూడా మరో పక్క నవదీప్ ఇలా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడం, ఈ ‘యేవమ్’ కథ కి ఉన్న పోటేన్షియాలిటీని చెప్పకనే చెప్తుందా అనేది చూడాలి.