మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (10:06 IST)

50 కోట్లకు ఐపి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు, డబ్బు కట్టి అంత్యక్రియలు చేసుకోండంటూ...

కర్నూలు: చిప్పగిరి మండలం రామదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. రూ. 50 కోట్లకు ఐపీ పెట్టి ఓ గోడౌన్ యజమాని ప్రహ్లాదశెట్టి పరారయ్యాడు. ఏమైందో ఏమో కానీ ప్రహ్లాదశెట్టి చనిపోయారు. అయితే ప్రహ్లాదశెట్టి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తెచ్చారు. 
 
కుటుంబసభ్యులు, బంధువులు ప్రహ్లాదశెట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే  ప్రహ్లాదశెట్టి దహన సంస్కారాలను  రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పు చెల్లించి దహన సంస్కారాలు చేసుకోవాలని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. 
 
డబ్బులు ఇవ్వని పక్షంలో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటుని గ్రామస్తులు వాపోయారు. ఇంతలోనే గ్రామస్తుల ఆందోళన పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులతో సర్దుబాటు చేశారు.