శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (10:54 IST)

చంద్రబాబుకు ఏమైంది?... అమెరికాలో వైద్య పరీక్షలు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏమైందంటూ ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాకు వెళ్లిన చంద్రబాబు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 
 
యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో గురువారం టెస్టులు చేయించుకున్నారు.  జూలై 28న రాత్రి అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. 
 
రెండోరోజుల క్రితం బాబు.. తన భార్య భువనేశ్వరితో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ దిగిన ఫోటో వైరల్ అయ్యింది. మిన్నెసోటలో చంద్రబాబును తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్ కోమటి, సతీశ్ వేమన, రామ్ చౌదరి తదితరులు కలిశారు.