1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (16:56 IST)

ఏపీకి హెచ్చరిక : మూడు రోజుల పాటు వర్షాలే వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు.. పశ్చిమ గాలులు వీస్తుండడంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
 
ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 
 
ఇక.. సోమ, మంగళ వారాలలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని సూచించారు.