1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (10:12 IST)

అల్ప‌పీడ‌నం ఎఫెక్ట్ ... నేడు,రేపు భారీ వర్షాలు

ఈ మ‌ధ్య అల్ప‌పీడ‌నాలు అధికం అయిపోయాయి. త‌ర‌చూ వాతావర‌ణం మేఘావృతం కావ‌డం, వ‌ర్షాలు సంభవిస్తున్నాయి. ఏపీలో నేడు, రేపు, వర్షాలు విస్తారంగా కురుస్తాయ‌ని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడనుంది. దీని ఫలితంగా ఈ రెండు రోజులు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయ‌ని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజ‌య‌వాడ‌తోపాటు ఏపీలో రాగల 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.