గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (11:20 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం- కోస్తా జిల్లాల్లో దంచికొట్టుడే.. అలెర్ట్

Rains
ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 
 
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రత్యేకంగా అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
అయితే ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ముందస్తుగా కురిసే భారీ వర్షాలకు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని, వాతావరణంలో మార్పులు కొనసాగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.