1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (17:35 IST)

ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతుంది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. 
 
తూర్పుమధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి కొనసాగుతోంది.
 
దీని ప్రభావము వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతములలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకొనే అవకాశం ఉంది. 
 
ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ వర్షాలు ఉన్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ.