శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (12:49 IST)

గిన్నిస్ రికార్డు : 90 రోజుల పాటు 100 మంది శ్రమించడంతో...

ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌‌సైకిల్ కంపెనీగా గుర్తింపు పొందిన హీరో మోటార్ కార్ప్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ కంపెనీకి చెందిన 100 మంది సిబ్బంది 90 రోజుల పాటు శ‍్రమించి హీరో పేరును గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కించారు. అదీ కూడా తెలుగు గడ్డపై ఈ అరుదైన ఘనతను హీరో మోటార్ కార్ప్ సొంతం చేసుకుంది. 
 
హోండా కంపెనీ నుంచి విడిపోయిన హీరో... ఇప్పటికి పదేళ్లు పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హీరో అరుదైన కార్యక్రమం చేపట్టింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాను వేదికగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్‌ సైకిల్‌ లోగోను ఏర్పాటు చేసి గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటుసంపాదించింది. 
 
చిత్తూరులో ఉన్న హీరో మోటార్‌ కార్ప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో స్ప్లెండర్‌ ప్లస్‌ బైకులను హీరో లోగో ఆకారంలో ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ సమీపంలో నేలను చదును చేశారు. ఆ తర్వాత హీరో లోగో ఆకారంలో రోజుకు కొన్ని బైకులను పార్క్‌ చేశారు.
 
ఇందుకోసం హీరోకు చెందిన 100 మంది సిబ్బంది 90 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. ఈ లోగో ఆకారంలో 1845 బైకులను నిలిపి ఉంచారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని షూట్‌ చేసి గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డుకు పంపించారు. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం లార్జెస్ట్‌ మోటార్‌ సైకిల్‌ లోగోగా గిన్నీస్‌ గుర్తించింది.