సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (17:23 IST)

హోటల్ రాంగోపాల్ వర్మ... టిఫిన్స్ అదుర్స్...

వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పేరొందిన రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగానే ఉంటారు. అందుకే వర్మకు అభిమానులు, విమర్శకులు అంతే స్థాయిలో ఉంటారు. వివాదాస్పద అంశాలను కూడా తన సినిమా ప్రమోషన్‌కు బాగా వాడుకుంటాడని వర్మ మీద ఉన్న అభిప్రాయం. అయితే వర్మ పేరునే తన హోటల్ ప్రచారానికి వాడుకున్నాడా లేక  అభిమానంతో పెట్టాడో తెలియదు కాని ఏకంగా తన హోటల్‌కు రాంగోపాల్ వర్మ టిఫిన్స్ అని పేరుపెట్టుకున్నాడు ఓ హోటల్ యజమాని.
 
తూర్పగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూరలంక గ్రామంలో ఈ టిఫిన్ సెంటర్ ఉంది. వర్మ సినిమాలకు, వర్మకు తాను పెద్ద ఫ్యాన్  అని అందుకే వర్మపేరుతో హోటల్ పెట్టుకున్నానని అంటున్నారు హోటల్ యజమాని. వర్మ పేరు పెట్టడం మూలంగా ప్రచారం బానే జరిగి  వ్యాపారం బానే సాగుతుందని అంటున్నాడు. 
 
అయితే ఇక్కడ టిఫిన్స్ కూడా రుచికరంగా ఉండటంతో ఆ నోటా.. ఈ నోటా తెలిసి మంచి గిరాకీగా సాగుతుది ఈ రాంగోపాల్ వర్మ హోటల్. మరి మీరు ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లా వెళితే... తప్పకుండా రాంగోపాల్ వర్మ టిఫిన్ టేస్ట్ చూసి రండి.