అనుమానం పెనుభూతమైంది... భార్య కాళ్లూ చేతులు నరికేశాడు..

woman
ఠాగూర్| Last Updated: గురువారం, 27 ఆగస్టు 2020 (15:56 IST)
అనుమానం పెనుభూతమైంది. ఓ కసాయి భర్త.. తన భార్య కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషనుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల మేరకు... శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆరు నెలల క్రితం నెల్లూరుకు చెందిన దుర్గ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య ప్రవర్తన మీద వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా శ్రీకాళహస్తి ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గ ప్రస్తుతం నెల్లూరు‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :