గురువారం, 5 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (19:51 IST)

పారుపల్లి కశ్యప్‌ను పక్కనబెట్టారు.. సీరియస్ అయిన సైనా నెహ్వాల్

టోక్యో ఒలింపిక్స్ జాబితా నుంచి తన భర్త, పారుపల్లి కశ్యప్ టోక్యో ఒలింపిక్స్ జాబితా నుంచి మినహాయించడంపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపై ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. ఇంకా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై సైనా ఆసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ప్రారంభం ఆయిన జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరానికి ఆమె గైర్హాజరయ్యారు.
 
పారుపల్లి కశ్యప్‌ను ఒలింపిక్స్ జాబితా నుంచి తప్పించడానికి గల కారణాలు తెలియకపోయినప్పటికి.. ఎలాగైనా బ్యాడ్మింటన్ శిబిరంలోకి తన భర్తను తీసుకురావాలని సైనా ప్రయత్నాలు మెుదలుపెట్టారు. మెరిట్ ఆధారంగా కశ్యప్‌ను శిబిరంలోకి అనుమతించాలని అధికారులను కోరినట్లు సమాచారం. ఆమె రిక్వెస్ట్‌పై అథారిటీ సానుకూలంగా స్పందించాలేదని తెలుస్తోంది.
 
మరోవైపు గోపీచంద్‌ అకాడమీలో 8 మంది ప్లేయర్స్‌కు మాత్రమే అవకాశం కల్పించడం అశాస్త్రీయమన్నారు. వీరు మాత్రమే ఒలింపిక్‌ను సాధించేవారిలా కనిపించారా?. వారిలో ముగ్గురికి మాత్రమే ఒలింపిక్‌ బెర్తులు ఖాయమయ్యాయి. ఇందులో చాలామందికి ఒలింపిక్స్‌ అవకాశం కష్టమే అంటూ అభిప్రాయపడ్డారు పారుపల్లి కశ్యప్‌.
 
'ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో తానున్నాననే విషయాన్ని గుర్తు చేశారు. సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌ల తర్వాతి స్థానం తనదేనని చెప్పుకొచ్చారు. అయినప్పటికి వారు తనను శిక్షణా శిబిరానికి ఆహ్వానించకపోవడం దారుణమని చెప్పుకొచ్చారు.