శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (11:30 IST)

వరకట్నం.. ప్రేమించి పెళ్లాడిన భార్యను చంపేశాడు.. చివరికి పోలీసులకు?

ఆధునికత పెరిగినా మహిళలపై వరకట్నం వేధింపులు తగ్గట్లేదు. ప్రేమించిన పెళ్లాడిన ఆ వ్యక్తి కట్టుకున్న భార్యను వరకట్నంతో కుటుంబ సభ్యులతో కలిసి హతమార్చాడు. ఈ విషయాన్ని దాచేశాడు. భార్య శవాన్ని పొలంలో పూడ్చేసి.. ఆమె కనిపించట్లేదని పోలీసులకు ఆ దుర్మార్గుడే ఫిర్యాదు చేశాడు. కానీ  మృతురాలి తల్లి అల్లుడు, అత్తా, మామలపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వారందరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. కురబలకోట పట్టణంలోని ఎన్‌వీఆర్‌ వీధికి చెందిన కుమారి, భాస్కర్‌ల కుమార్తె జి.గాయత్రి (28) తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసింది. ఈమెకు బస్సు డ్రైవర్ మల్‌రెడ్డితో ప్రేమ ఏర్పడింది. ఆపై వీరిద్దరికీ ప్రేమ వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత మల్‌రెడ్డి కుటుంబసభ్యులు ఇంటికి రావాలనిచెప్పడంతో వారి వద్దకు వెళ్లిపోయారు.
 
మెట్టినింట్లో అడుగు పెట్టిన నాటి నుంచి గాయత్రికి వేధింపులు మొదలయ్యాయి. దీంతో 2019, సెప్టెంబరు 10న భర్త, అత్తమామలపై పోలీసులకు గాయత్రి కుటుంబసభ్యులు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం తీసుకురావాలని చెప్పినా చేయడం లేదని మల్‌రెడ్డి పలుమార్లు ఆమెపై చేజేసుకున్నాడు. అయితే ఈ ఏడాది జనవరి 2వ తేదీన గాయత్రిని తన తల్లిదండ్రుల సాయంతో మల్‌రెడ్డి హతమార్చాడు. ఈ వ్యవహారం పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. గాయత్రిని చంపేసి పొలంలో పూడ్చిపెట్టినట్లు మల్‌రెడ్డి ఒప్పేసుకున్నాడు.