శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:08 IST)

పిల్లలు పుట్టలేదని భార్యను పాడుబడ్డ భవనంలోకి తీస్కెళ్లి...

పిల్లలు పుట్టలేదనే కారణంతో భార్యను చిత్రహింసలు పెట్టిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. గౌసియా అనే మహిళకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగకపోవడంతో భర్త మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని ఆమెను ఒక పురాతనమైన పాడుబడిన బంగ్లాలా ఉన్న ఇంటిలో ఆమెను ఒంటరిగా బంధించి చిత్రహింసలకు గురి చేసాడు. ఆమె గత కొద్ది రోజులుగా ఆ చీకటిలోనే జీవిస్తోంది.
 
గౌసియా ఆచూకీ కోసం వెతికిన వారి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుని మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసారు. మానవ హక్కుల కమిషన్ అధికారుల చొరవతో ఆమె భర్తను పోలీసులకు అప్పగించారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.