శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (16:07 IST)

డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలు.. ఎక్కడ..?

నేటి తరుణంలో అత్యాచారాలు, స్మగ్లింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. హైదరాబాద్‌లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల్లోకెళ్తే.. బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శనివారం రోజున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్ అధికారులు వాటిని వెలికి తీశారు.
 
ఆ మెషీన్‌లో మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావుకిలోల చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాములు బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా.. దుబాయ్ నుండి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ కోటింగ్ గోల్డ్ ప్లేట్లను కుక్కర్‌లో దాచి ఉంచగా బ్యాగేజ్ తనిఖీల్లో బయటపడ్డాయి.