శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (10:28 IST)

మహిళ స్నానం చేస్తుంటే.. వీడియో తీసిన ఇంజనీరింగ్ విద్యార్థి

మహిళ స్నానం చేస్తుంటే ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు వీడియో తీశాడు. ఈ విషయాన్ని గమనించిన బాధిత మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. 
 
హైదరాబాద్, హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, తుర్కయాంజాల్‌ పరిధిలోని మనుగనూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి  గంగపురి వెంకటేష్‌ (22) తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. 
 
దీన్ని గమనించిన బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు పారిపోతున్న యువకుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని రిమాండ్‌కు తరలించారు.