గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (12:28 IST)

అద్దె ఇంట్లో మద్యం సేవించాడనీ... 4వ అంతస్తు నుంచి తోసేశాడు...

అద్దెకు ఇచ్చిన ఇంట్లో మద్యం సేవించాడని ఆ వ్యక్తిని ఇంటి యజమాని కుమారుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

అద్దెకు ఇచ్చిన ఇంట్లో మద్యం సేవించాడని ఆ వ్యక్తిని ఇంటి యజమాని కుమారుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, నారాయణగూడలో సంజు అనే యువకుడు ఆ ప్రాంతంలో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగాడు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ప్రతి రోజూ రాత్రి మద్యాన్ని ఇంటికి తెచ్చుకుని సేవించేవాడు.
 
ఈ విషయం ఇంటి యజమాని కుమారుడు బశ్వంత్‌కు తెలిసింది. దీంతో సంజుతో గొడవపడ్డాడు. మద్యం సేవించవద్దని హెచ్చరిక కూడా చేశాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సంజు మద్యం సేవిస్తుండగా బశ్వంత్ చూశాడు. 
 
దీంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఫలితంగా సహనం కోల్పోయిన బశ్వంత్.. సంజును నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. అక్కడ నుంచి కిందపడటంతో సంజుకు బలమైన గాయాలు తగిలాయి. 
 
ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.