ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (11:59 IST)

లోక్ పైలెట్ కాళ్లు - చేతులకు స్టీల్ రాడ్స్... డ్యూటీకి ఫిట్టా.. అన్‌ఫిట్టా?

హైదరాబాద్ కాచిగూడలో సిగ్నల్ ఓవర్ షూట్ చేసి రైలు ప్రమాదానికి కారణమైన లోకో పైలెట్ గురించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కాళ్లు, చేతులకు స్టీలు రాడ్స్ వేశారు. అలాంటి వ్యక్తి లోకోపైలెట్‌కు అనర్హుడు. కానీ, రైల్వే వైద్యులు అతనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడంతో ఆ లోకోపైలెట్ విధులకు హాజరై, ఈ ప్రమాదానికి కారణభూతుడయ్యాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరుకు చెందిన ఎల్‌.సీచ్. చంద్రశేఖర్ అనే వ్యక్తి నగరంలోని గోల్నాక నెహ్రూనగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. ఈయన ఆరంభంలో గూడ్సు రైలు నడుపుతూ వచ్చాడు. 
 
అయితే, 2006లో జరిగిన ప్రమాదంలో ఇతని రెండు చేతులు, ఒక కాలుకు స్టీల్ రాడ్స్ వేశారు. ఇప్పుడు అతని శరీరంలో చేతులు, కాలుకు రాడ్స్ ఉన్నాయని భార్య అంటోంది. అయితే స్టీల్ రాడ్స్ ఉండగా రైల్వే డాక్టర్లు ఇతనికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారనేది సందేహం. 
 
ఇదే విషయాన్ని అతని భార్య కూడా ప్రమాదం జరిగిన తర్వాత కొందరు రైల్వే సిబ్బంది, అధికారులతో అన్నట్లు సమాచారం. గూడ్స్ రైలు నడిపించే చంద్రశేఖర్‌కు యేడాది క్రితం పదోన్నతిపై ఎంఎంటీఎస్ లోకో పైలెట్ అయ్యారని తెలిసింది. ఇప్పుడు అతని ఫిట్‌నెస్‌పై జోరుగా చర్చ జరుగుతుంది.