శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (17:41 IST)

జట్టు పట్టులా మారాలంటే కరివేపాకు పొడితో స్నానం చేయండి...

కరివేపాకు వేయకుండా మనం వంట పూర్తి కాదు. అలాగే  పోషకాలు పుష్కలంగా ఉండే కరివేపాకు ఆరోగ్యానికే కాదు జుట్టుకు  సంరక్షణకూ బాగా ఉపయోగపడుతుంది. 
 
* పావుకప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు వేసి వేడిచేయాలి. నూనె చల్లారిన తర్వాత మాడుకు పట్టించి కాసేపు నెమ్మదిగా మర్దన చేయాలి. ఓ ఇరవై నిమిషాలాగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలిపోవడం క్రమంగా తగ్గుతుంది. 
 
* మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీలో మెంతులతో పాటు గుప్పెడు కరివేపాకును వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకూ, వెంట్రుకలకూ బాగా పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మారుతుంది. 
 
* గుప్పెడు కరివేపాకును మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో పావు కప్పు పెరుగును కలిపి జుట్టుకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది.
 
* కొందరికి చిన్న వయసులోనే జుట్టు నెరుస్తుంది. అలాంటి వారికి కరివేపాకు ఆ సమస్యనూ తగ్గిస్తుంది. నాలుగు చెంచాల కొబ్బరినూనెకు అరకట్ట మెంతికూరా, కాస్త వేపాకూ, మూడు రెబ్బల కరివేపాకును కలిపి చిన్న మంటపై వేడిచేయాలి. నూనె చల్లారిన తర్వాత పడుకోబోయేముందు జుట్టుకు పట్టించి మర్నాడు తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు నెరవకుండా నల్లగా మెరుస్తుంది.