శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2019 (20:37 IST)

పెరగన్నం తినడం ఇష్టంలేదా? ఐతే ఇలా చేయండి

మనం తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటిస్తుండాలి. కొంతమంది కూరలతోనే భోజనం ముగించేస్తుంటారు. ఐతే కూర అన్నంతోపాటు పెరుగును కూడా భోజనంలో భాగం చేసుకోవాలి. కొందరికి పెరుగన్నం తినడం ఇష్టం వుండదు. అలాంటివారు పెరుగు వడను వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా శరీరానికి క్యాల్షియం అందుతుంది.

వీటితో పాటు సోడియం, పొటాషియం, ప్రోటీన్లు, విటమిన్స్ కూడా శరీరానికి లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు పెరుగు వడను స్నాక్స్‌గా అందించడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. శరీరానికి కావాల్సిన బలం పొందవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఇక పెరుగు వడను ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావాల్సిన పదార్థాలు : 
పెసరపప్పు - 3 కప్పులు 
చాట్ మసాలా, జీలకర్రపొడి - చెరో స్పూన్
ఎండు మిర్చి - 4 
కారం - ఒక టీ స్పూన్ 
పచ్చిమిర్చి - 3
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్ 
జీలకర్ర - ఒక టీ స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
కొత్తమీర తరుగు - ఒక కప్పు 
పెరుగు - నాలుగు కప్పులు 
 
తయారీ విధానం : 
ముందుగా పెసరపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. మిక్సీలో పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులో పెసరపప్పు మిశ్రమాన్ని వడలాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత వడలపై తాలింపు వేసిన పెరుగు జీలకర్రపొడి, చాట్ మసాల, కారం వేసి.. కొత్తిమీర గార్నిష్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ భలేగా వుంటుంది.