శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్

తులసి ఆకుల రసం - తేనె మిశ్రమం ఆరగిస్తే...

ప్రస్తుతం చాలా మందిని కిడ్నీ సమస్య వేధిస్తూ ఉంది. కిడ్నీల్లో రాళ్లు చేరడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్రం పోసే స‌మ‌యంలో నొప్పి, మంట‌, వికారం, జ్వ‌రం, పొట్ట కింది భాగంలో నొప్పి ఉండ‌డం, మూత్రం రంగు మార‌డం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, మూత్రం తక్కువ‌గా రావ‌డం, మూత్రం దుర్వాస‌న‌గా ఉండ‌టం, మంట, వికారంగా ఉండడం, జ్వరం, ఇలాంటి  ల‌క్షణాలు క‌నిపిస్తాయి.
 
కిడ్నీలో రాళ్ళతో బాధపడే వారు డాక్ట‌ర్ సలహాను పాటించి, అందుకు తగిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే రాళ్లు త్వ‌ర‌గా క‌రిగించుకోవ‌చ్చు. ప్రతి రోజు పరగడుపున తులసి ఆకుల రసంలో తేనె కలుపుకుని తాగితే ఎలాంటి బాధలు ఉండవు. ఇలా 6 నెలలపాటు పాటించడం వల్ల కీడ్నీలో రాళ్లు త్వరగా కరిగిపోతాయి. 
 
కిడ్నీలో స్టోన్లు రాకుండా యాపిల్ పండు మెరుగ్గా ప‌ని చేస్తుంది. ప్రతి రోజు ఒక యాపిల్ పండును తింటే కిడ్నీలో రాళ్లు రావు. నిత్యం యాపిల్‌ను తినడం వల్ల రాళ్లు ఉన్నా తొందరగా కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్లు స‌మ‌స్య ఉన్న‌వారు ద్రాక్ష‌పళ్లు త‌ర‌చూ తినడం వలన మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే పుచ్చకాయలను  తినడం వల్ల కిడ్నీలో రాళ్లు క‌రిగిపోతాయి. 
 
ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కలుపుకొని రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు తాగడం వల్ల కిడ్నీలో స్టోన్లు త్వ‌ర‌గా కరిగిపోతాయి. నిత్యం బ్రౌన్ రైస్‌, కోడిగుడ్లు, సోయాబీన్సు, ఇలాంటి ఆహారం తీసుకోవటం వలన కిడ్నీలో స్టోన్లు క‌రిగిపోతాయని గృహ వైద్య నిపుణులు చెబుతున్నారు.