బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (07:09 IST)

విజయసాయిరెడ్డి వస్తేనే నేను వస్తా: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు.. ఎంపీ విజయసాయి రెడ్డిల ప్రమాణాల హైడ్రామా కొనసాగుతూనేవుంది. అయితే విజయ్ సాయి రెడ్డి రాలేదు గాని బదులుగా వైసిపి తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ విజయనిర్మల, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈస్ట్ పాయింట్ కాలనీ షిరిడి సాయిబాబా దేవాలయం వద్దకు చేరుకున్నాయి.  వెలగపూడి మాత్రం.. విజయసాయిరెడ్డి వస్తేనే.. నేను కూడా వచ్చి ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు.
 
తమ సచ్ఛీలతను నిరూపించు కోవడానికి ఎంపీ విజయసాయిరెడ్డి ఈస్ట్ పాయింట్ కాలనీ లో ఉన్న సాయిబాబా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని.. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఇదే విషయమై పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గం అక్రమాన్ని విజయనిర్మల నేతృత్వంలో శనివారం.. ఈస్ట్ పాయింట్ కాలనీ లో ఉన్న సాయిబాబా గుడి వద్దకు చేరుకున్నారు.

వెలగపూడి కూడా ఇక్కడకు వచ్చి ప్రమాణం చేయాలని నినాదాలు చేశారు.  ఉదయం 10 గంటలకు గుడి వద్దకు చేరుకున్న చేరుకున్న శ్రేణులు వెలగపూడి రాకకోసం గంటల తరబడి ఎదురు చూసాయి.  ఒకవేళ రాకపోతే ఆయన ఇంటికి వెళ్లి సాయిబాబా ఫోటో పై ప్రమాణం చేయిస్తామని.. విజయనిర్మల చెప్పడంతో.. ఎంవిపి కాలనీ లోని వెలగపూడి నివాసం , కార్యాలయం వద్దకు పెద్దఎత్తున పోలీసులు చేరుకున్నారు. 

అయితే మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో తన నివాసం వద్దకు చేరుకున్న  వెలగపూడి మాట్లాడుతూ.. తాను సవాల్ చేసింది విజయసాయిరెడ్డి పై .. అతను వస్తే తాను కూడా గుడికి వచ్చి  ప్రమాణం చేస్తానని తేల్చి చెప్పారు.