మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (16:11 IST)

మామా, అల్లుడికి చిప్పకూడు ఖాయం: బుద్దా వెంకన్న

'నిజమే! ట్రైలర్‌కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు. ఇక అసలు బొమ్మ పడితే యుశ్రారైకాపా ఖాళీ. మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయం' అంటూ ట్విట్టర్లో వైసీపీ నేతలకు చురకలంటించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న.

ఈమధ్య వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ట్విట్టర్ అంతగా అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఆయన బీజేపీ రాష్ట్ర నేతలకు చురకలంటిద్దామనుకుని వారిచేత ఎన్నడూ లేనన్ని చీవాట్లు తిన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా.. వైఎస్ జగన్ సీఎంగా ఏడాది పాలనపై ట్వీట్ చేస్తూ 'ఇది ట్రైలర్ మాత్రమే'నని అన్నారు. దీనిపై స్పందించిన బుద్దా వెంకన్న పంచులతో కౌంటర్ ఇచ్చారు.