సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 2 ఏప్రియల్ 2020 (22:47 IST)

ముఖ్యమంత్రికి ఐఎఎస్ అధికారుల సంఘం రూ. 20 లక్షల విరాళం అందజేత

కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు బాసటగా నిలుస్తూ ఐఎఎస్ అధికారుల సంఘం ప్రకటించిన ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.

ఐఎఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు గురువారం తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఇందుకు సంబంధించిన పత్రాన్ని అందించారు. 
 
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 162 ఐఎఎస్ అధికారులు తమ మూడు రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేందుకు ముందుకు రాగా, ఆ మొత్తం రూ.20 లక్షలుగా ఉంది. 
 
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి విభిన్న కార్యక్రమాలు చేపట్టేలా ఐఎఎస్ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారని, వాటిని అమలు చేయటంతో తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు. సిఎంను కలిసిన వారిలో సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, విజయకుమార్, ప్రధ్యుమ్న తదితరులు ఉన్నారు.