శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (18:52 IST)

ఏపీలోకి అనుమతిస్తే లాక్ డౌన్ నీరుగారినట్లే : డీజీపీ గౌతమ్ సవాంగ్

తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను ఏపీలోకి అనుమతించడమంటే లాక్ డౌన్ ను నీరుగార్చినట్లే అవుతుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావంగ్ అన్నారు.

హైదరాబాద్ లో హాస్టళ్ల మూసివేతతో పెద్ద సంఖ్యలో యువత తెలంగాణ నుంచి ఏపీకి రావడంతో తెలుగురాష్టాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన సవాంగ్ కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిందని, ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా ప్రధాని, సీఎం కోరారని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోకి వస్తే అనుమతించేది లేదని అన్నారు. రెండు వారాల క్వారంటైన్ తర్వాతే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. వైరస్ సంక్రమించకుండా ఉండేలా చేయడమే లాక్ డౌన్ ఉద్దేశమని తెలిపారు.