1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. IIIT-Nuzvid student commits suicide

ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూ.... ఉరేసుకుంది..

IIIT-Nuzvid Student
కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదం జరిగింది. ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్‌.భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. తన ప్రియుడుతో వీడియో కాలింగ్‌ చేస్తూ హాస్టల్‌ రూములో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ విషయాన్ని సహచర విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల సరైన కారణాలు తెలియాల్సి ఉంది.
తర్వాతి కథనం
వేదికపైనే అగ్నికి ఆహుతైన గాయని.. ఎక్కడ?