శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:20 IST)

కేసీఆర్‌తో జగన్ జగడం నాటకాలు: లంకా దినకర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ జలజగడం నాటకమని తేలిపోయిందని,  టీటీడీ బోర్డు సభ్యుల నియామకంతో అనుమానాలు పటాపంచలు అయ్యాయని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పునర్విభజన చట్టంలో పేర్కొన్న వెలుగొండ, తెలుగుగంగలను అనుమతి లేని ప్రాజెక్టులని లేఖలు వ్రాసిన వారికి నజరానా?.. విద్యుత్ బకాయిలు అటకెక్కించినందుకు భరణమా? అంటూ ప్రశ్నించారు.

టీటీడీ బోర్డులో ఈసారి చాలావరకు అసభ్యులు సభ్యులు అయ్యారని రాష్ట్రం కోడై కూస్తుందన్నారు. కేంద్రం ప్రసాద్ పథకంతో దేవాలయాలకు నిధులు ఇస్తుంటే, ఇక్కడ మాత్రం దేవాలయాల నిర్వాహణ వారి జేబు సంస్థలుగా మార్చారని విమర్శించారు.

ఇప్పటి టీటీడీ బోర్డు నియామకంతో తిరుపతి పవిత్రత కన్నా స్వంత ప్రయోజనాలే మిన్న అనే దృష్టితో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారని లంకా దినకర్ ఆరోపించారు.