శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (16:18 IST)

జగన్‌ కు మానసిక వ్యాధి: దేవినేని ఉమ

సీఎం జగన్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవాచేశారు. ఉద్యమాల ద్వారానే జగన్‌ పిచ్చి తగ్గుతుందన్నారు.

జగన్‌ అధికారం చేపట్టాక ప్రజలు పండగల్ని మర్చిపోయారని, ఇసుక కొరత ద్వారా లక్షల మంది కడుపుకొట్టారని దుయ్యబట్టారు. ప్రజాభిప్రాయం స్వీకరించకుండా కమిటీలు రిపోర్ట్‌లు ఎలా ఇస్తాయని ఆయన ప్రశ్నించారు. జీఎన్‌రావు ఆర్డీవోగా ఉన్నప్పుడే రెండుసార్లు సస్పెండ్‌ అయ్యారని, ఆయన రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తే ప్రజలు ఏమైపోతారని నిలదీశారు.

విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. రైతులు న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొకుండా.. మంచి లాయర్లను జగన్ కొనేస్తున్నాడని విమర్శించారు. రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారని ఉమ హెచ్చరించారు.