1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (14:29 IST)

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ys jagan
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. బొత్స మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అత్యధిక పోలింగ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన కొనసాగించాలన్న ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందన్నారు. 
 
తమ ప్రభుత్వం మంచి చేస్తే తమ పార్టీకి ఓటు వేయాలని జగన్ రెడ్డి ప్రజలను కోరారని, విద్య, వైద్యం, పరిపాలనలో సంస్కరణలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 
 
సాగరనగరం విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చామని, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వాటిని నిలుపుకొంటామని చెప్పారు.