మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 20 మే 2019 (21:07 IST)

రమణ దీక్షితులనే ఆశీర్వాదం చేసి పంపిన జగన్..?

ఆయన సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వర స్వామి చెంత సేవ చేసిన వ్యక్తి. స్వామివారికి అభిషేకాలు చేసి దగ్గరుండేవారు. స్వామివారిని ఒక్క నిమిషం కనులారా వీక్షిస్తే చాలు అనుకునే భక్తులు ఎంతోమంది కానీ ఆ స్వామివారి ముందే పనిచేయడం ఒక గొప్ప మహద్భాగ్యం.
 
అంతటి అదృష్టం వంశపారపర్యంగా వస్తున్న రమణదీక్షితుల సొంతం. కానీ పదవీ విరమణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రమణ దీక్షితులను అక్కడి నుంచి సాగనంపేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రమణ దీక్షితులు తన ఉద్యోగం కోసం ఎన్నో పాట్లు పడ్డారు. కోర్టును ఆశ్రయించారు. అయితే ఉపయోగం లేకుండా పోయింది.
 
అప్పట్లో ఎపి ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు దీక్షితులు. ఇది కాస్తా చర్చకు దారితీసింది. వైసిపి అధికారంలోకి వస్తే ఏదో ఒకటి చేద్దామని హామీ ఇచ్చారు. ఆ తరువాత సైలెంట్ అయ్యారు. కానీ మరో రెండు రోజుల్లో కౌంటింగ్ జరుగబోతోంది. పోలింగ్ అయినప్పటి నుంచి విజయం మీదే.. అధికారం మాదే అంటూ చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి రమణదీక్షితులు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
 
స్వామి.. వచ్చేది మన ప్రభుత్వమే. పదవీ విరమణ ఎత్తేస్తాం. మళ్ళీ మీకు స్వామి సేవ అంటూ జగన్ చెప్పి పంపారట. దీనితో స్వామివారి చెంత పనిచేసిన రమణ దీక్షితులకి జగన్ ఆశీర్వాదం లభించిందంటూ చెప్పుకుంటున్నారు. అదీ సంగతి.