బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 18 ఏప్రియల్ 2019 (21:39 IST)

జగన్ అవి కప్పుకుని పడుకుంటున్నాడు.. లోకేష్ ట్వీట్

వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు నారా లోకేష్. వై.ఎస్.జగన్ నన్ను విమర్సించే కన్నా ముందు తాను ఎలాంటివాడో తెలుసుకోవాలంటూ ట్వీట్ చేశారు. బిజెపి.. కమలం పువ్వులను జగన్ కప్పుకుని ఉన్నారని ట్విట్టర్లో విమర్సించాడు లోకేష్. రాజకీయంలో జగన్ లాంటి వ్యక్తి ఉండరేమో బహుశా అంటూ ట్వీట్ చేశారు.
 
విలువ కలిగిన రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి. ఇది జగన్‌కు తెలియదనుకుంటా. తెలిసి ఉంటే ఇలా చేసి ఉండడు అంటూ లోకేష్ చెప్పుకొచ్చాడు. మా పాలన ఏవిధంగా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మాకే ప్రజలు అవకాశం ఇస్తారు. కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబునాయుడే. 
 
అందరినీ నమ్ముకున్న జగన్ ఇక అలాగే ఉండిపోవాల్సిందే. కమలంను కప్పుకుని ఉన్న జగన్‌కు ఏమీ కనిపించడం లేదంటూ సెటైర్ వేశారు లోకేష్. వైసిపి నేతలు కొంతమంది తనపై సామాజిక మాథ్యమాల్లో సెటైర్లు వేస్తుండడంతో లోకేష్ జగన్ పైన ఈ విధంగా స్పందించారు.