శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (11:27 IST)

ప్రజాస్వామ్య విలువలకు అడుగుడుగునా పాతరేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం: కాలవ శ్రీనివాసులు

ప్రజాస్వామ్య విలువలకు అడుగడుగునా పాతరేస్తున్న జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే పంచాయతీఎన్నికల నిర్వహణకు  పూనుకుందని,  ఆ ఎన్నికల్లో ప్రజాతీర్పుని పరిహాసం పాలుచేసే కుట్రలకు ఇప్పటికే తెరలేపిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కాలవశ్రీనివాసులు స్పష్టంచేశారు. ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. 

నిన్నటివరకు అడుగడుగునా ఎన్నికల కమిషనర్ ను అవమానించడం, ఎన్నికల కమిషన్ నిర్ణయాలను బేఖాతరు చేయ డం వంటివిచేసిన ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాలతోనే గత్యంతరం లేకనే పంచాయతీఎన్నికలకు సిద్ధమైందన్నారు. ప్రభుత్వసలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు ఇస్తున్నప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని కాలవ తెలిపారు. 

ఈఎన్ని కల్లో తాము ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందా లేదా అనే గందరగోళంలో ప్రజలంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతి కించుకోవడానికి రాజ్యాంగం ప్రతిపౌరుడికి ఓటుహక్కుకల్పించింద ని, కానీ ఆ హక్కుని దుర్వినియోగంచేసేలా ప్రభుత్వచర్యలున్నా యని మాజీమంత్రి తేల్చిచెప్పారు.

ప్రతిపక్షపార్టీలకు చెందినవారు ఎన్నికల్లోపోటీచేసే అవకాశం లేకుండా చేయడానికి అధికారపార్టీ నేతలు అడుగడుగునా విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సక్రమంగా ఎన్నికలకు సహకరించాల్సిన సర్కారే, అభూతకల్పన లతో, ఏదోసాయం చేస్తున్నామనే మాటలతో ఏకగ్రీవాల పేరుతో తప్పుడు ప్రకటనలివ్వడం, ప్రజలను మోసంచేయడంలో భాగంగా ఇచ్చినవేనని మాజీమంత్రి తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలవల్ల ముఖ్యమంత్రి ప్రజలకు కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.

ఏకగ్రీవాలు చేసుకుంటే లక్షలకు లక్షలు పంచాయతీలకు వస్తాయనే భ్రమను కల్పిస్తున్నప్రభుత్వం, ప్రజలను మభ్యపెట్టడానికే ఈకొత్త ఎత్తుగడకు తెరలేపిందన్నారు.  నేడు ప్రభుత్వం ఇచ్చినప్రకటనల్లో వేసిన సచివాలయం బొమ్మ, ఏరాష్ట్రంలోని దో సజ్జలసమాధానం చెప్పాలని కాలవ డిమాండ్ చేశారు. వేరే రాష్ట్రంలోని సచివాలయం బొమ్మను పత్రికల్లోవేసి, అదితమప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటున్న పాలకులు, ప్రజలు ఏంచేసినా, ఏం చెప్పినా నమ్ముతారనే భావనలో ఉన్నారని కాలవ తెలిపారు.

సాంకేతిక కారణాలుచూపి, ప్రతిపక్షపార్టీలకు చెందిన మద్ధతుదారు లు ఎన్నికల్లో పోటీచేయకుండా  అడ్డుకోవాలని చూస్తున్నారని,  చిన్నచిన్న కారణాలనుచూపి, వార్డు కౌన్సిలర్లు, పంచాయతీ అభ్యర్ధుల నామినేషన్లను అధికారులు ఎక్కడికక్కడ తిరస్కరిస్తు న్నారన్నారు.  ప్రతిపక్షపార్టీలకు చెందినవారు పోటీలోనిలిచి, ప్రజలు వారికి ఓట్లేస్తే, వైసీపీ మద్ధతుదారులుచిత్తుచిత్తుగా ఓడిపో తారన్నభయంతోనే అధికారపార్టీ ఈవిధమైన కొత్త కుట్రలకు తెరలే పిందని కాలవ మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలు, దుర్నీ తిని ఓటుఅనే ఆయుధంతోనే ప్రజలు అడ్డుకోవాలన్నారు. వైసీపీకి బుద్ధిచెప్పడానికి ప్రజలంతా ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారని, అధికా రపార్టీ తరుపున పోటీచేసివారందరికీ ఘోరపరాజయం తప్పదని మాజీమంత్రి జోస్యం చెప్పారు. ఎక్కడైనా కొందరు అభ్యర్థులు రాజకీ యపార్టీల ముసుగులో లేకపోయినా, వారు ఎలాంటివారో స్థానికుల కు కచ్చితంగా తెలుస్తుందన్నారు.

ప్రభుత్వం ఆదినుంచీ స్థానిక ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపకపోవడం, ఓటర్లజాబితాను  సవరించకపోవడం, కొత్త ఓటర్లజాబితానుఖరారు చేయకపోవడం వంటి కారణాలు ఒకఎత్తయితే, ఎన్నికలను ఆపడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లడంచూస్తుంటే, అధికారపార్టీ ఎన్నికలకు ఎంతలా భయపడుతోందో అర్థమవుతోందన్నారు. అధికారంలోకి వచ్చి నిం డా 20నెలలైనా కాకమునుపే, ఎన్నికలను అడ్డుకోవడానికి అధికార పార్టీ ఎందుకింతలా అడ్డుకుంటోందన్నారు.

ప్రజాభిమానం పొందలేని అసమర్థస్థితిలో ఉన్న అధికారపార్టీ ప్రజలను బెదిరించడానికి అనేకమార్గాలను అన్వేషిస్తోందన్నారు. ఓట్లేయ వద్దని, ఎన్నికల్లో పోటీచేయవద్దని చెప్పడంతో పాటు, నామినేషన్ల ను తిరస్కరించడం వంటిచర్యలతో అధికారపార్టీ ఎలాంటిసంకేతాలు ఇస్తోందో సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి , సలహాదారులు అందరూకలిసి,  చివరకు ఎన్నికలనిర్వహణకే భయపడటం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వ ముసుగేసుకొని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రలోభాలకు గురిచేయడం, వారిని గందరగోళపరచడం వంటి చర్యలు పాలకులకు తగవన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా చేసేకుట్రల్లో అధికారపార్టీవారే భాగస్వాముల వుతున్నారన్నారు.

ప్రజలు తమకు ఓటేస్తారనే భావన నిజంగా వైసీపీవారికి ఉంటే, ప్రతి పౌరుడు, తన ఓటుహక్కుని సద్వినియోగ పరుచుకునే అవకాశాన్ని ఓటర్లకు కల్పించాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. చంద్రబాబునాయుడి నాయకత్వంలో ప్రజాస్వా మ్య పరిరక్షణకోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా కాలవ స్పష్టంచేశారు.