ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (23:04 IST)

Minister Post to Nagababu ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!!

nagababu
Minister Post to Nagababu ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు చోటు కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. 
 
నిజానికి ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒక సీటును జనసేనకు కేటాయిస్తే, ఆ సీటులో నాగబాబును రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే, మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ అభ్యర్థి పోటీ చేయనున్నారు. ఈ సీట్లకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ఆయా పార్టీలు ప్రకటించాయి. 
 
దీంతో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు చంద్రబాబు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో పాతమంది మంత్రులకు చోటుంది. ప్రస్తుతం 24 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో మంత్రిని నియమించుకునే వెసులుబాటు ఉంది. 
 
వీరిలో జనసేన పార్టీ నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉండగా, ఇపుడు నాగబాబుతో నాలుగో మంత్రి పదవిని జనసేనకు ఇస్తున్నారు. సీఎఁ బాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌లు ఉండగా, కొత్తగా నాగబాబు కూడా చేరనున్నారు.