శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (12:30 IST)

ఓటేయమంటే రూ.2వేలు అడుగుతున్నారు: జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టీడీపీనే విజయభేరి మోగిస్తుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టీడీపీని కాపాడతాయని జేసీ వెల్లడించారు. ఆ రెండు పథకాలు లేకపోతే టీడీపీ పరిస్థితి భగవంతుడికే తెలియాలన్నారు. 
 
చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు అని జేసీ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు దాదాపుగా 120 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు.
 
ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో సుమారు రూ.50 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఓటేయండని కోరితే రూ.2000 ఇవ్వాలని ప్రజలే అడుగుతున్నారని జేసీ విస్మయం వ్యక్తం చేశారు. ఇకమీదట ఒక్కో ఓటు రూ.5000 పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు.