శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 24 జనవరి 2020 (13:03 IST)

జేసీనా మజాకా.. ఈసారి జగన్‌ను పొగిడారు.. ఎందుకంటే?

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చర్చకు తెరదీస్తుంటారు అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జె.సి.ఎప్పుడు ఏదీ మాట్లాడిన అది సంచనలమే. టిడిపిలో ఉండి ఆ పార్టీ నేతలను తిట్టడం ఆయనకు అలవాటు. అంతేకాదు ఎవరినైనా కడిగిపారేయడం జె.సి.కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఎపి రాజధాని వ్యవహారంపై ఇప్పటికే చాలాసార్లు స్పందించారు జె.సి. అయితే ఆయన స్పందించిన తీరు ఒక్కోసారి ఒక్కోరకంగా ఉండేది. 
 
తాజాగా మూడు రాజధానుల ప్రకటనపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వామపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పందించారు. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు తీసుకురావడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. అయితే శాసనసభ తీర్పును అందరు గౌరవించాల్సిందేనని అన్నారు.
 
మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అంతసులభతరం కాదన్న జెసి.. మనిషికి తలకాయ రాజధాని అయితే బ్రెయిన్ సెక్రటరియేట్  అన్నారు. బ్రెయిన్‌ను తీసుకువెళ్లి జగన్ విశాఖపట్నంలో పెడుతున్నారని జేసీ అన్నారు. దేశంలో కేంద్రం కోర్టులు ఉన్నాయని ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.