ప్రజలు గొర్రెలు ... కాకుంటే 151 సీట్లు ఎలా ఇస్తారు : జేసీ దివాకర్ రెడ్డి

jc diwakar reddy
ఠాగూర్| Last Updated: బుధవారం, 15 జనవరి 2020 (12:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలను గొర్రెలుగా భావిస్తున్నారనీ, నిజంగా ప్రజలు గొర్రెలు కాకపోతే వైకాపాకు 151 సీట్లు ఎలా ఇస్తారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.

రాజధాని తరలింపును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. బుధవారం మందడంలో జరుగుతున్న రైతుల దీక్షకు జేసీ దివాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, ఏపీ రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని లేనిపక్షంలో తమను తమిళనాడు లేదా కర్నాటకలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, వైఎస్ జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో యేడాదిలోపు జగన్ సతీమణి భారతి సీఎం కాబోతోందని జోస్యం చెప్పారు. ఒకరి మూర్ఖత్వం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

విశాఖలో రాజధాని పెట్టాలంటే జగన్‌ నిర్ణయం తీసుకుంటే సరిపోదని.. అందరి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైగా, ప్రజలను జగన్ గొర్రెలుగా భావిస్తున్నారన్నారు. నిజంగానే గొర్రెలు కాకపోతే జగన్ పార్టీకి 151 సీట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.దీనిపై మరింత చదవండి :