శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (15:21 IST)

#హై పవర్ కమిటీ భేటీ.. రాజధాని రైతుల ప్రయోజనాల పరిరక్షణపై చర్చ

హై పవర్ కమిటీ భేటీలో భాగంగా రాజధాని రైతుల ప్రయోజనాల పరిరక్షణపై చర్చించామని మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. పాలన వికేంద్రీకరణతో పాటు, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించామన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమావేశంలో చర్చకు వచ్చాయన్నారు. 
 
రాష్ట్రంలోని 13 జిల్లాలకు సమానంగా, సమాంతరంగా అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో కమిటీ చర్చిందని తెలిపారు. రైతులు, ఉద్యోగులతోపాటు, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ నెల 13న మరోసారి కమిటీ సమావేశమవుతుందని నాని చెప్పారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని, అభివృద్ధిపై నియమించిన కమిటీలు ఇచ్చిన నివేదికల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సోమవారం మరోసారి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో చర్చించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలతోపాటు శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికల్లోని అంశాలు, సిఫారసులపై తాజా భేటీలో క్షుణ్ణంగా చర్చించామని మంత్రి వెల్లడించారు.