ఏపీ రాజధాని అమరావతే.. అధైర్యం వద్దు : మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy
ఠాగూర్| Last Updated: సోమవారం, 6 జనవరి 2020 (12:29 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతేనని, అందువల్ల ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సికింద్రాబాద్‌లో గృహ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో అమరావతి రైతులు, మహిళలు అక్కడకు వచ్చి ఓ వినతి పత్రం సమర్పించారు.

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని.. దానిని అక్కడే కొనసాగించాలని, తమను కాపాడాలని కిషన్‌ రెడ్డి కాళ్లుపట్టుకుని ప్రాధేయపడ్డారు. దీంతో భావోద్వేగానికిలోనైన మంత్రి కిషన్ రెడ్డి... పైవిధంగా భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం చేస్తానన్నారు. దీంతో రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విభిన్న ప్రకటనల వల్లే ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. 'రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చినప్పుడు వారికి ధైర్యం చెప్పి, అండగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపై ఉంటుంది. రైతుల నుంచి ఇప్పటికే భూముల సేకరణ జరిగింది. పార్టీలు, ప్రభుత్వం కలిసి చర్చించుకోవాలి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడం మంచిది కాదు' అని హితవుపలికారు.దీనిపై మరింత చదవండి :