మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 30 నవంబరు 2017 (14:38 IST)

చిరంజీవి ఆనాడు చేసింది పవన్ కళ్యాణ్‌కు ఈనాడు పెద్ద శాపం... జేసీ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను ఏం చెప్పదలుచుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో దాచుకోకుండా చెప్పేస్తుంటారు. అవతల వ్యక్తి ఎంత పెద్దపోస్టులో వున్నాసరే తన అభిప్రాయం మాత్రం వెల్లడిస్తారు. తాజాగా చిరంజీవిపై సెటైర్లు వేశారు. చిరంజీవి ప్రజారాజ్యం

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను ఏం చెప్పదలుచుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో దాచుకోకుండా చెప్పేస్తుంటారు. అవతల వ్యక్తి ఎంత పెద్దపోస్టులో వున్నాసరే తన అభిప్రాయం మాత్రం వెల్లడిస్తారు. తాజాగా చిరంజీవిపై సెటైర్లు వేశారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి, ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపి తప్పు చేశారన్నారు. 
 
విత్తనాలు వేసి మొలకెత్తే దశలోనే పాడు చేస్తే ఇక పంట ఎక్కడ పండుతుందీ అంటూ విమర్శించారు. ఆనాడు చిరంజీవి చేసిన ఆ పనులే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు శాపంగా మారాయన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు ఎందుకు? చక్కగా సినిమాలు తీసుకుంటే బావుంటుంది అని వ్యాఖ్యానించారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయాల్సి వుంటుందని వెల్లడించారు.