గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:44 IST)

పవన్ కంటే నేనే డాన్స్ బాగా చేస్తా : కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. అయితే కేఏ పాల్ చేసే ప్రచారాలు ప్రజల వద్ద కంటే పాస్టర్ల సంఘాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలను చిత్తు చిత్తుగా ఓడిస్తానని చెబుతున్నాడు. తాను కూడా నర్సాపురం నుంచే పోటీ చేస్తానని పేర్కొంటూ పవన్, నాగబాబు కాస్కోవాలని సవాల్ విసిరారు.
 
ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌ల గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. సినిమాల్లో చిరంజీవి అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్‌కు డ్యాన్స్‌లు రావని వ్యంగ్యంగా మాట్లాడారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌లను పరిహసిస్తూ స్టేజీపైన డ్యాన్స్ చేసి చూపించారు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాల్‌ను సీరియస్‌గా తీసుకోకపోయినా ఆయన చేష్టలతో నవ్వుకుంటున్నారు.